ప్రేమిస్తే చంపేస్తారా...? హా అవును చంపేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఎవరు అయినా సరే దారుణంగా చంపేస్తున్నారు. ఒక ఘటన కాదు రెండు ఘటనలు కాదు.   ప్రతీ నెలా కూడా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ లో ఒక దారుణం జరిగింది. వీణవంక మండలంలో దారుణం చోటు చేసుకుంది.

పొతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్కురి ప్రవీణ్ 22 దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన  యువతి ప్రేమిస్తున్నాడని  గ్రామస్తులు చెప్తున్నారు. ఇటివల అదే అమ్మాయిని పెళ్ళి చేసుకొవాలని కుటుంబ సభ్యులను కోరాడు. అది ఇష్టం లేని యువతి కుటుంబ సబ్యులు హత్య చెసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: