గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తే జగన్ ప్రభుత్వం ఇసుకని బంగారం ధర తో సమానం చేసిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇసుక మాఫియా చేసి ప్రజలపై భారం వేసారు అని మండిపడ్డారు. ఇసుక కాంట్రాక్ట్ ను రాష్టం మొత్తం గుత్తగా తనవరికి కట్టబెట్టేటందుకే ఇసుక కార్పొరేషన్ అని మండిపడ్డారు. అలాగే తమిళనాడు ఇసుక మాఫియా కింగ్ శేఖర్ రెడ్డి కి కట్టబెట్టేటండుకే ఇసుక కార్పొరేషన్ అని విమర్శించారు.

వేల కోట్లు కొట్టేయటానికే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అన్నారు. ఉచితంగా ఇచ్చే ఇసుకను  బ్రహ్మ పదార్థంగా ఎందుకూ చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇసుక లేఖ లక్షల మంది కార్మికులు పస్తులు పడుకొంటున్నా ప్రభుత్వనికి పట్టటం లేదు అని ఆయన  నేడు మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: