ఒక పక్క పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే హైదరాబాద్ లో డ్రగ్స్ మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట డ్రగ్స్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సిటీ యూత్ ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు... విచారిస్తున్నారు.

స్టూడెంట్ విసా మీద వచ్చి ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు డానియల్ అనే విద్యార్ధి. లంగర్ హౌజ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు... రిమాండ్ కి తరలించారు. ఇక అతని నుంచి నిందితుడి నుండి 6 గ్రాముల కో కై న్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: