తెలంగాణా మాజీ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారింది అని అపోలో ఆస్పత్రి వైద్యులు నేడు ప్రకటించారు. ఆయనకు డయాలసిస్ చేస్తున్నామని, ఆయన  వైద్యానికి స్పందించడం లేదు అని వైద్యులు పేర్కొన్నారు. మరో 24 గంటలు గడిస్తే గాని ఆయన ఆరోగ్యంపై ఏదోక విషయం చెప్తామని అన్నారు.

ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగు కావాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు ఆయనను అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వైద్యులతో మాట్లాడి మరిన్ని వివారాలు తెలుసుకున్నారు.  ఆయనతో పాటుగా  మరో మంత్రి నిరంజన్ రెడ్డి కూడా వెళ్ళారు. కాగా ఇటీవల నాయిని కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆరోగ్యం విషయంగా మారిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: