రాగల 30 నిమిషాల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరమంతా దట్టంగా అలుముకున్న మేఘాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో చీకటిని వాతావరణం తలపిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. డీ ఆర్ ఎఫ్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దు అని, ఆఫీసు పనులు ఉన్నా సరే రద్దు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని అధికారులు సూచించారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అధికారులు ఎవరూ కూడా సెలవలు పెట్టవద్దు అని అధికారులు సూచించారు. హయత్ నగర్, బేగం పేట, ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఉప్పల్ లో కూడా కుండపోత వర్షం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: