సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఎన్ని హెచ్చరికలు చేసినా సరే ప్రజల్లో మార్పు అనేది రావడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. లాటరీ లో కారు వచ్చింది ని చెప్పగానే ఒక మహిళ నమ్మేసింది.  ఈ ఘటనపై సౌత్ డిఎస్పీ కమలాకర్ వివరాలు వెల్లడించారు. వట్టి చెరుకూరు మండలంలో ఒక మహిళకు లాటరీలో కారు వచ్చిందని బెంగాల్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి.

కారు వచ్చిందని ఒక మహిళ వద్ద నుండి పదకొండు లక్షలు ఆన్లైన్ లో నిందితులు వసూలు చేసారు అని తెలిపారు. ఈ ఘటనలో కలకత్తాకు చెందిన ఇద్దరు అరెస్టు అయ్యారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం అని అన్నారు. లాటరీ వచ్చిందన్న ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దు అని సూచించారు. కొంతమంది బ్యాంక్ ఉద్యోగుల పేరుతో ఫేక్ కాల్ చేసి ఓటిపి నంబర్స్ తెలుసుకొని అకౌంట్ నుండి నగదు డ్రా చేస్తున్నారు అని అన్నారు. ఆధార్ నంబర్ కూడా ఎవ్వరికి చెప్పవద్దు అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: