పింక్ డైమెండ్ విషయంలో రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి లకు టీటీడీ అండగా నిలిచింది అనే ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీకి పరువు నష్టం కలిగించారని ఇద్దరిపైన గతంలో 200 కోట్ల పరువు నష్టం కేసు టీటీడీ ధికారులు వేసారు. 2 కోట్లు కోర్టు ఫీజ్ చెల్లించి మరి కేస్ వేసారు. అయితే అనూహ్యంగా కేసుని విత్ డ్రా చేసుకోవాలని తిరుపతి కోర్ట్ లో టీటీడీ విజ్ఞప్తి చేసింది.

వేంకటేశ్వర స్వామి పై నమ్మకం ఉందని రమన దీక్షితులు, విజయసాయి రెడ్డి లు ప్రకటించారు. కాబట్టి ఇక కేసు వద్దు అని కోర్టుకు టీటీడీ వాదన వినిపించింది. దీన్ని ప్రశ్నిస్తూ హిందు జనశక్తి తెలంగాణ తరపున కోర్టులో కేసు దాఖలు చేసారు న్యాయవాది ఆదినారాయణ. కొన్నాళ్ళ క్రితం పింక్ డైమండ్ కాస్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: