భారత్ చైనా సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతుంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఇప్పుడు పరిస్థితి ఉంది అనే మాట నిజం.   మన సైనికులను చైనా టార్గెట్ చేసి ఎప్పుడు ఏ చర్యలకు దిగుతుందో అనే ఆందోళన అందరిలో నెలకొంది. భారీ దాడులకు కూడా చైనా చలికాలాన్ని అనువుగా చేసుకుని దిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపధ్యంలో భారత్... ఇప్పుడు యూరప్ దేశాల సహకారం తీసుకునే అవకాశం ఉంది. యూరప్ దేశాల్లో సైనికులు ఎక్కువగా చలిలో విధులు నిర్వహిస్తూ ఉంటారు. దీనితో ఇప్పుడు  వారి సహాయ సహకారాలు తీసుకుని సరిహద్దుల్లో ఆర్మీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూరప్ దేశాల సైనికులతో ఎక్కువగా చర్చలు జరుపుతుంది. త్వరలోనే ప్రత్యేక పరికరాలు కూడా రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: