హైదరాబాద్ లో భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలను ఆదుకోవడానికి అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తం అయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఏపీ నుంచి ఎన్డిఆర్ ఎఫ్ బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. 37 బోట్లను ఏపీ ప్రభుత్వం పంపించింది. రవింద్రభారతి లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసారు ఏపీ అధికారులు.  24 గంటల నిరంతర పర్యావేక్షణ చేసేందుకు 4 అధికారుల బృందంను ఏపీ నుంచి పంపించారు.

గజ ఈతగాళ్ళు ,రెస్క్యూ టీం లను అందుబాటులో ఏపీ ప్రభుత్వం తెలంగాణా కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అధికారులు. అధికారులు అందరితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక మంత్రి కేటిఅర్ కూడా ప్రజలతోనే ఎక్కువగా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. భారీ వర్షం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: