సిఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరబాద్ లో ఇప్పుడు భారీగా వరదల్లో  ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయం చేస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈ రోజు నుండి రు.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు రాష్ట్ర మునిసిపల్ శాఖ. బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దనే ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది తెలంగాణా సర్కార్.

అవసరమైతే ఈ సహాయం ఇంకా పెంచడానికి కూడా సిద్ధమని, వర్షాల వల్ల ఇబ్బందిపడ్డ ప్రతి వ్యక్తికి, కుటుంబానికి ఈ సాయం అందాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, ఎన్జీవోలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందేటట్టు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ పలు నియోజకవర్గాల్లో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: