ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతోందని, కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటి బయటకు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను ఓదార్చడానికి సీఎం లు స్వయంగా పర్యటనలు చేయడం సహజం అని ఆయన అన్నారు. కానీ కేసీఆర్ బయటకు రాకపోవడం దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేసారు. మొదట నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇప్పుడు లక్ష రూపాయలు మాత్రమే ఇస్తా అంటున్నాడు అని మండిపడ్డారు.

పత్తి, వరి పంటలు మొత్తం నేలకొరిగి పోయాయని అన్నారు. మొక్కజొన్న మొలకెత్తిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వర్షాలు పడ్డప్పుడు పంట నాణ్యతలో సడలింపులు ఇవ్వాలన్నారు. వరి రైతులకు ఎకరానికి 20వేల పరిహారం ఇవ్వాలని సూచించారు. క్వింటాలుకు 2500 రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కోరారు. మొక్కజొన్నకు 1850రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: