ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారు అనే విషయంలో ఇప్పటి వరకు ఎన్నో అనుమానాలు ఉండేవి. కాని ఇప్పుడు సిఎం జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. తాజాగా విద్యా శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించి ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 2 నుంచి ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ చేస్తామని,  నవంబర్ నెలలో ఒంటి పూట బడులు ఉంటాయని జగన్ స్పష్టం చేసారు.

ఒకవేళ విద్యార్ధులను తల్లి తండ్రులు పంపించకపోతే ఆన్లైన్ క్లాసులను నిర్వహించాలి అని సూచించారు. రెండు రోజులకు ఒకసారి క్లాసులు ఉంటాయని అన్నారు. బేసి సంఖ్యలో ఒకరోజు సరి సంఖ్యలో ఒకరోజు క్లాసుల నిర్వహిస్తారు. అంటే 1, 3, ,5, 7 క్లాసులకు ఒక రోజు, 2, 4, 6, 8 కి ఒక రోజు క్లాసుల నిర్వహణ ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు అవుతుంది అని జగన్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: