విజయవాడలో దివ్య అనే అమ్మాయిని రేప్ చేసిన ఘటన సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశ ప్రజలు అందరూ కూడా షాక్ అయ్యారు. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఏపీ సర్కార్ కూడా ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ...

దివ్య ను కిరాతకంగా హత్య చేయడం బాధాకరం అని ఆయన అన్నారు. కుటుంబానికి అండగా ఉంటాం అని అన్నారు. హత్య ఘటనపై సీఎం జగన్ దృష్టి సాధించారు అని చెప్పారు. ఇప్పటికే హోంమంత్రి కుటుంబ సభ్యులను కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ ను  కలిసేందుకు బంధువులకు అనుమతిచ్చారని చెప్పారు. 7 రోజుల్లో ఘటనపై చార్జిషీటు దాఖలు చేస్తాం అని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: