దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారు. ఇది పండుగల సీజన్ అని దేశ ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇండియాలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని అన్నారు. అమెరికా  బ్రెజిల్ తో పోలిస్తే  పరిస్థితి చాలా బాగుంది అని ఆయన అన్నారు. కరోనా నుంచి ఇప్పుడే కోలుకున్నామని ఆయన తెలిపారు. ఇళ్ళ నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నామని, కరోనాపై పోరాటం సుదీర్ఘమైనది అని ఆయన చెప్పారు.

కరోనా తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ కుదుట పడుతుంది అని ఆయన అన్నారు. మన దేశంలో  90 లక్షల కోవిడ్ బెడ్స్ కాళీ గా ఉన్నాయని ఆయన చెప్పారు. కరోనాతో ఇంకా మనం పోరాటం చేస్తున్నామని చెప్పారు.  భారత్ లో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని అన్నారు. కరోనాతో ప్రమాదం లేదని అనుకోవద్దు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: