తూర్పు లడఖ్‌ లోని డెమ్‌ చోక్ సెక్టార్‌ లో భారత సైన్యం సోమవారం అరెస్టు చేసిన చైనా సైనికుడిని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద చైనా సైనికులకు అప్పగించింది ఇండియా ఆర్మీ.  మంగళవారం రాత్రి ఈ ప్రక్రియ ముగిసింది. "భారత సైన్యం గత రాత్రి చుషుల్ మోల్డోలో సమావేశ స్థలంలో చైనా సైనికుడు కార్పోరల్ వాంగ్ యా లాంగ్ ను చైనా సైన్యానికి అప్పగించింది" అని జాతీయ మీడియా రాసింది.

చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) లో కార్పోరల్‌గా ఉన్న ఈ సైనికుడిని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాతే చైనా మిలిటరీకి తిరిగి ఇస్తామని భారత సైన్యం రెండు రోజుల క్రితం పేర్కొంది. అక్టోబర్ 19 న తూర్పు లడఖ్ లోని డెమ్చోక్ సెక్టార్లో అరెస్టు చేశారు. ఒక చైనీస్ కార్పోరల్ భారత సైన్యంలోని నాయక్‌ తో సమానం. చైనా సైనికుడికి ఆక్సిజన్, ఆహారం మరియు స్వెట్టర్ లు వైద్య సహాయం అందించామని ఇండియన్ ఆర్మీ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: