ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పులు దొంగ ఎదురు కాల్పులు అంటూ... మావోయిస్టు పార్టీ నేత వెంకటేష్ ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అక్టోబర్ 18న మరో ఇద్దరు ఆదివాసి బిడ్డలను హత్య చేసింది అని ఆయన అన్నారు. ఈ హత్యలను ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి అని కోరారు.

హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి పై కోర్టు ద్వారా న్యాయ విచారణ చేపట్టి హత్యలకు పాల్పడిన పోలీసులు కఠినంగా శిక్షించాలి అని  డిమాండ్ చేసింది. మావోయిస్టు పార్టీ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణహోమాన్ని ఆపే వరకు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక వాదులు వివిధ పార్టీల ప్రజా సంఘాల వారు ప్రతిఘటించాలని పోరాడాలని  తాము కోరుతున్నామని చెప్పింది. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు అని మండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: