విశాఖలో ఎవరైనా  భూదందాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుంది అని విశాఖ ఎంపీ సత్యనారాయణ అన్నారు. అమరావతిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ను ప్రభుత్వం ఆధారాలతో సహా బయటపెట్టింది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోకే విశాఖ ముఖ్యనగరం అని ఆయన అన్నారు. దేశంలోని ఇతర రాజధానులతో అభివృద్ధిలో పోటీ పడగల నగరం విశాఖ అని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రజలతో పాటు తాము కూడా రాజధాని విశాఖకు ఎప్పుడు తరలుతుందోనని  ఎదురు చూస్తున్నాం అని ఆయన అన్నారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందే విదంగా సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారు అని తెలిపారు. దురదృష్టవశాత్తు కోర్టులో కేసులు ద్వారా రాజధాని తరలింపు ప్రక్రియ ఆలస్యం అవుతువుంది అని విశాఖ ఎంపీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: