ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థను టార్గెట్  చేస్తూ ఏపీలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం టర్గెట్ చేసింది. తాజాగా ఏపీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. దిగువ స్థాయి న్యాయ వ్యవస్థలపై ఫిర్యాదు చేయాలంటే ప్రమాణ పత్రం తప్పనిసరి అని ఏపీ హైకోర్ట్ పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండా వారిపై చర్యలు తీసుకోలేం అని వివరించింది.

అయితే ప్రధాన న్యాయమూర్తి తన విచక్షణ అధికారులతో కొన్ని ప్రత్యేక సందర్బాల్లో వ్యవస్థ ప్రయోజనం కోసం విచారణ కు అదేశించవచ్చు అని తెలిపింది. విచారణ తరువాత ఆ ఫిర్యాదు ఇబ్బందులకు గురిచేసేలా ఉందని తేలినా, ఆరోపణలు నిజమని నిరూపించలేకపోయినా సరే చర్యలు తీసుకోండి అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా ఏపీ హైకోర్ట్ తీర్పుల విషయంలో సిఎం జగన్ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: