కరోనాతో మరణించిన వారి విషయంలో కొంత మంది నుసరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తే తమకు కూడా  కరోనా వస్తుంది అనే భయం కొందరిని వెంటాడుతుంది. దీనితో కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. అయితే కొందరు మాత్రం సహాయం చేసే విషయంలో ముందుకు వస్తున్నారు.

తాజాగా కరోనాతో కృష్ణా జిల్లాలో ఒక వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ అత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. దీనితో... అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ ఆత్మహత్య చేసుకున్న... 72 సంవత్సరాల వయస్సు ఉన్న  కరోనా రోగి అంత్యక్రియలను స్వయంగా నిర్వహించారు.  అయన  మంచి మనసుపై పోలీసు ఉన్నతాధికారులు అలాగే  గ్రామస్తులు ప్రశంసించారు. స్థానిక వైసీపీ నాయకులు కూడా ఆయన పని తీరుపై ప్రసంశలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: