ఆన్లైన్ కొనుగోళ్ళు అనేవి ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. చాలా మంది ఏమైనా చిన్న వస్తువు కావాలన్నా పెద్ద వస్తువు కావాలన్నా సరే ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు.  అయితే తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అమెజాన్ కోసం పనిచేస్తున్న డెలివరీ బాయ్ ఒక కస్టమర్‌ ను మోసం చేసాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డెలివరీ బాయ్ కస్టమర్ కు ఆర్డర్ రద్దు చేసారని, త్వరలో మీరు చెల్లించిన డబ్బులు మీకు వస్తాయని చెప్పాడు.  అయితే అమెజాన్ సిబ్బంది విచారణలో మాత్రం మొబైల్ కస్టమర్‌ కు  అందించినట్టుగా చూపించింది. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెలివరీ బాయ్ నుండి మొబైల్ ఫోన్ రికవరీ చేసుకున్నారు.  అతను గతంలో ఇలాంటి చర్యలకు ఏమైనా పాల్పడ్డాడా అనే దాని మీద ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: