ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశీయ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 38.3 శాతం తగ్గి 5.98 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. వినియోగదారుల కొనుగోళ్ల అంచనాను తెలుసుకోవడానికి గానూ... దేశ వ్యాప్తంగా ప్రాంతీయ రవాణా కార్యాలయాలలో (ఆర్టీఓ) ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసారో చూసారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ గణాంకాలు ఆటో మొబైల్ చెప్పిన అమ్మకాల లెక్కల కంటే 3.74 మిలియన్లు లేదా 37.5% తక్కువ.

మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణ అనే మూడు రాష్ట్రాల ఆర్టీఓల నుండి డేటా లేదు. కరోనా కారణంగానే ఈ పరిస్థితి  ఏర్పడింది అని చెప్పాలి. ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనితోనే ఆటో మొబైల్ రంగం అనేది దాదాపుగా దెబ్బ తింది అనే విషయం చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: