కరోనా మహమ్మారి నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ -95, డబుల్, ట్రిపుల్ లేయర్ మాస్క్‌ ల ధరలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే  ప్రకటించారు. ఎన్ -95 మాస్క్‌ లను రాష్ట్రంలో రూ .19 నుంచి రూ .49 ధరల పరిధిలో సరఫరా చేయవచ్చని, డబుల్, ట్రిపుల్ లేయర్ మాస్క్‌ లు ఒక్కోదానికి రూ .3 నుంచి రూ .4 వరకు లభిస్తాయని తెలిపారు.

సరఫరాదారులు  మాస్క్ ల ఎంఆర్పీ  ధరలో 70 శాతం కోట్ చేయవచ్చు. ఆస్పత్రులు రోగులకు విక్రయించడానికి  కొనుగోలు ధరలో 110 శాతం వరకు వసూలు చేయవచ్చు. 110 శాతానికి మించి వసూలు చేయడానికి ఏ ఆసుపత్రికి అనుమతి లేదని స్పష్టం చేసారు. ఫిర్యాదులు  చేయాలి అనుకుంటే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, జిల్లా స్థాయి అధికారులను సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: