ఏపీ సిఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఇంద్ర కీలాద్రిపైకి వెళ్తుండగా అక్కడ కొండ చరియలు విరిగి పడుతుండటం కంగారు పెడుతుంది. అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు.  మూడు రోజులుగా చిన్న చిన్న రాళ్ళు అక్కడ విరిగి పడుతున్నాయి. నేడు మరోసారి భారీగా రాళ్ళు విరిగి పడ్డాయి. మౌన స్వామి ఆలయం వద్ద రాళ్ళు విరిగి పడ్డాయి. దీనితో అక్కడ ఏర్పాటు చేసిన  రేకుల షెడ్ లు కూడా భారీగా దెబ్బ తిన్నాయి.

సిఎం పర్యటనకు ముందు రాళ్ళు విరిగి  పడటంతో అధికారులలో కలవరం మొదలయింది. రాళ్ళు విరిగి పడటంతో ఇప్పుడు ముగ్గురికి గాయాలు అయ్యాయి.  ఇక రాళ్ళు విరిగి పడే  ప్రదేశంలో అధికారులు హెచ్చరిక బోర్డ్ లు కూడా ఏర్పాటు చేసారు. భక్తులు నేడు భారీగా వచ్చారు. ఈ క్రమంలో  రాళ్ళు విరగడం ఆందోళన కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: