కరీంనగర్ జిల్లా  హుజురాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేసారు. అగ్ర దేశాలు కరోనా తో వణికిపోయాయి అని అన్నారు.  ఇండియా లాంటి దేశంలో పేద వారి పరిస్థితి ఎలా అని భయపడ్డామని, కరోన వ్యాధితో ఎంతో మంది ఆత్మీయులను పోగొట్టుకున్నాం అని పేర్కొన్నారు. కరోన తో  99.5 శాతం కు పైగా బతికి బయట పడ్డారు అని ఆయన చెప్పారు.

కేవలం 0.5% మాత్రమే చనిపోయారు అని ఆయన అన్నారు. ఇప్పటికీ వైరస్ పూర్తిగా పోలేదు అని అన్నారు. ప్రతి ఒక్కరూ  జాగ్రత్తలు   తీసుకోవాలన్నారు. కరోన వైరస్ ను తక్కువగా అంచనా వేయకూడదని చెప్పారు. రాబోయే పండుగలను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలన్నారు. గుంపులు అయ్యి వ్యాధిని స్ప్రెడ్ చేయద్దు అని సూచించారు. త్వరలో హుజురాబాద్ లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: