హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గంగమ్మకు పూజలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గంగమ్మ తల్లి ఒడిలో సర్వమత ప్రార్థనలు చేశాము అని ఆయన తెలిపారు. తమ పూజలు అంగీకరించి గౌరవించి ఈ ప్రళయాన్ని ఆపాలని ప్రత్యేక పూజలు చేశాము అని ఆయన అన్నారు. అమ్మవారి దీవెనలు ప్రజలు ప్రభుత్వ వుండాలి అని ఆయన  పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రళయం రావడం వల్ల ప్రజలు అందరూ ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు.

1908 నాటి కాలాన్ని తలపిస్తూ మూసి ఉదృతంగా ప్రవహించడంతో నగరంలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఆయన అన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకున్నామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... గంగమ్మ తల్లి సర్వమత ప్రార్థనలు అంగీకరించి పూజలు గౌరవించి ఈ ప్రళయాన్ని ఆపాలని ప్రత్యేక పూజలు చేశామని అన్నారు. అమ్మవారి దీవెనలు ప్రభుత్వానికి కావాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: