ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. నవంబరు రెండు నుండి ఏపిలో స్కూల్స్ ప్రారంభిస్తాం అని ఆయన అన్నారు. వారానికి మూడు రోజులు తగ్గకుండా స్కూల్స్ నడుపుతాం అని అయన హామీ ఇచ్చారు. నవంబరు నెలలో విద్యార్థులకు మధ్యాహ్నం వరకే స్కూల్స్ అని స్పష్టం చేసారు. టెక్నాలజీ వసతులు ఉన్న విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తాం అని ఆయన అన్నారు.

సెలవులు తగ్గించి స్కూల్స్ నడుపుతాం అని అన్నారు. సిలబస్ తగ్గించేందుకు ఎస్ ఈ ఆర్టీ కసరత్తు చేస్తోంది అని మంత్రి వివరించారు. స్కూల్స్ ప్రారంభమయ్యే లోపు టైం టేబుల్, సిలబస్ అనౌన్స్ చేస్తాం అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ నుండి కాపాడుకునేందుకు పది నుండి పదిహేను నిమిషాలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం అని ఆయన  మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: