ఆంధ్రప్రదేశ్ లో ఏపీ సర్కార్ ఏ సంక్షేమ కార్యక్రమం మొదలు పెట్టినా సరే దానిపై అధికార పార్టీ నేతలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఏదోక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వైఎస్సార్ బీమాపై కూడా టీడీపీ నేత బొండా ఉమా విమర్శలు చేసారు. చంద్రన్న భీమా కి నకలే వైఎస్సార్ భీమా అని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ పథకాలే పేరు మార్చి ఇస్తున్నారు అని అన్నారు.

దేశంలో మొదటి సారి పేద ప్రజలకు మేలు చేసే పథకాలు పెట్టింది చంద్రబాబే అని ఆయన పేర్కొన్నారు. భీమా పథకాన్ని గత 17 నేలల నుంచి చనిపోయిన వారికి అమలు చేయాలి అని డిమాండ్ చేసారు. జగన్ ఎన్నికల ముందు చెప్పినట్టు 3000 పింఛన్లు పెంచాలి అని అన్నారు. కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలను నిర్వీర్యం చేశారని అన్నారు. కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలకు నిధులు మంజూరు చేయాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: