బంగాల్​లో డిసెంబర్ నాటికి రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు ఆ రాష్ట్ర బిజేపి యువ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ సౌమిత్రా ఖాన్ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో శాంతి, భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో బిజేపి కార్యకర్తలపై దాడులను ఖండించారు.బంకురా జిల్లాలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.



సౌమిత్ర వ్యాఖ్యలను టీఎంసీ దీటుగా తిప్పికొట్టింది. బిజేపి పాలిస్తున్న ఉత్తర్​ప్రదేశ్, గుజరాత్​లోనే చట్టబద్ధ పాలన నశించిందని ఆరోపించింది. ముందుగా ఆ రాష్ట్రాలపై దృష్టిసారించాలని బిజేపి నేతలకు హితవు పలికింది.బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలని బిజేపి జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా పలువురు బిజేపి నేతలు ఇప్పటికే డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: