రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన 'ఐటం' వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్​నాథ్​కు నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కమల్​నాథ్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లేనని పేర్కొంది.


అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్వాలియర్​లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆదివారం పాల్గొన్నారు కమల్​ నాథ్. బిజేపి మహిళా అభ్యర్థిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.కమల్​నాథ్ వ్యాఖ్యలపై బిజేపి మండిపడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం నిరసనకు కూడా దిగారు. జాతీయ మహిళా కమిషన్​ కమల్​నాథ్​ను ఇప్పటికే వివరణ కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: