ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.  తన తండ్రి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉంది అని ఆయన కూతురు శివాత్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కరోనాతో పోరాటం చేయడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆమె పేర్కొన్నారు. అందరి ఆశీస్సులతో  నాన్న క్షేమంగా తిరిగి వస్తారని తాము ఆశిస్తున్నట్టు ఆమె చెప్పారు.

ఇటీవల రాజశేఖర్ కు ఆయన భార్య జీవితకు  కరోనా సోకినా సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి వారు హోం ఐసోలేషన్ లోనే కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత కుమార్తెలకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత కొన్ని రోజులుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: