హైదరాబాద్ నగరంలోని వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఆయన ప్రజలతో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న 10 వేల ఆర్థిక సహాయం సరిపోదని కిషన్ రెడ్డి అంటున్నారు. ఆర్థిక సాయం పెంచే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

కేంద్రం నిధులపై రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని అన్నారు. నిధులపై రాష్ట్ర మంత్రులు అవగాహాన లేకుండా మాట్లాడటం సరైంది కాదు అని ఆయన హెచ్చరించారు. ప్రచారం కోసమే కొందరు మంత్రులు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఈ సాయంత్రానికి కేంద్ర బృందం రాష్ట్రనికి చేరుకుంటోందని ఆయన తెలిపారు. వరద ప్రాంతాల్లో పర్యటించటంతో పాటు.. కేంద్ర బృందం సీఎస్ ను కలుస్తోంది అని అన్నారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలకు చేసే సాయాన్ని కేంద్రం చేస్తోందని, తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం 1350కోట్లు కోరిందని చెప్పారు. కేంద్ర బృందం ఫీల్డ్ విజిట్ తర్వాత కేంద్రం సాయం చేస్తోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: