నాయిని తో తనకు చాలా సన్నిహితం ఉంది అని మాజీ హోం మంత్రి  జానారెడ్డి పేర్కొన్నారు. నాయిని గురించి మాట్లాడుతూ... మా జిల్లా వాసి నాయిని అని అన్నారు. నాయిని ఇకలేరని జీర్ణించుకోలేక  పోతున్నా అని ఆవేదన వ్యక్తం చేసారు. మాతో పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. సోషలిస్టు పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషించారు అని అన్నారు.

సోషలిస్టు పార్టీ లో నాయిని ఉన్న సమయంలో నేను కూడా రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. 1978 జనతా పార్టీలో కూడా నాయిని తో కలిసి పనిచేశాను అన్నారు. మంత్రి గా ఉన్నప్పుడు ప్రతిపక్షం లో నాయిని ఉన్నాడని చెప్పారు. రాజకీయంగా నేను ఎదగడానికి నాయిని కృషి మరువలేనిది అని గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పై నిరంతరం నాయిని కృషి చేసే వాడని ఆయన చెప్పుకొచ్చారు. నాయిని ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతున్న అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: