విజయవాడ  ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు  అని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాజధానిపై  అయోమయం నెలకొందని ఆయన పేర్కొన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు అని అన్నారు.

రాజధానిని ఇక్కడే కొనసాగించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నా అన్నారు. దుర్గగుడిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. పాలకులు , అధికారుల నిర్లక్ష్యం వల్లే నిన్న కొండచరియలు విరిగిపడ్డాయని, ఘటనకు అధికారులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేసారు. భవిష్యత్తులో ఇంద్రకీలాద్రిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులు చర్యలు తీసుకోవాలని, పాలకులకు మంచి బుద్దిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp