బీహార్ రాజధాని పాట్నాలో ఎన్నికల మేనిఫెస్టో ని ప్రకటించిన అనంతరం కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం... వ్యాక్సిన్ భారీ స్థాయిలో ఉత్పత్తికి అందుబాటులోకి వచ్చిన వెంటనే , బీహార్‌లోని ప్రతి వ్యక్తికి ఉచిత టీకా వేస్తామని చెప్పారు. మా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న మొదటి వాగ్దానం ఇది అని ఆమె చెప్పారు.

ఇక ఇదిలా ఉంటే బిజెపికి ఓటు వేస్తేనే ఉచిత టీకా ఇస్తారా అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.అక్కడి విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. బీహార్ లో బిజెపికి ఓటు వేయకపోతే? వారు టీకా ఉచితంగా పొందుతారా లేదా? అని ప్రశ్నించారు. మరి భారతదేశంలోని ఇతర రాష్ట్రాల సంగతేంటి? ఉచిత వ్యాక్సిన్ పొందడానికి వారు అర్హులు కాదా? కేంద్రం ద్వారా వ్యాక్సిన్‌ ను రాజకీయం చేయడం మినహా అసమర్థ ప్రభుత్వం నుండి ఇంకేమి ఆశించవచ్చు?   అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: