మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అక్కడి పోలీసులను చాలా వరకు వేధిస్తూనే ఉన్నాయి.  ఇక ఇప్పుడు కాస్త కఠినంగా చర్యలు తీసుకోవడం, జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. గత 24 గంటల్లో మహారాష్ట్ర పోలీసులలో 70 కొత్త కరోనా కేసులు గుర్తించారు. ఈ విషయాన్నీ అక్కడి పోలీసు శాఖ వెల్లడించింది.

ఆ రాష్ట్ర పోలీసుల్లో మొత్తం కేసులు 25 వేల 988 గా ఉన్నాయి. వీటిలో 1,771 మంది క్రియాశీల కేసులు ఉన్నాయి అని అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. 23 వేల 945 మంది సిబ్బంది కోలుకోగా, 272 మంది మరణించారు. ఇతర రాష్ట్రాల కంటే మహారాష్ట్రలోనే పోలీసులు ఎక్కువగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: