బీఆర్కేఆర్ భవన్ లో సీఎస్ తో కేంద్ర బృందం భేటీ ముగిసింది. వరద ప్రాంతాల్లో పరిస్థితులను కేంద్ర బృందానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ వివరించారు. రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని అధ్యయనం  చేయనుంది కేంద్ర ప్రభుత్వ బృందం. మరి కాసేపట్లో పాత బస్తీ చంద్రాయణ గుట్ట పల్లె చెరువు సహా... ఇతర వరద ముంపు ప్రాంతాలను ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సందర్శిస్తుంది.

మరి కాసేపట్లో మరో ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సిద్ధిపేట వెళ్తుంది. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా అంచనా వేయనుంది కేంద్ర బృందం. పర్యటన తరవాత రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్రానికి  5 గురు సభ్యుల కేంద్ర బృందం నివేదిక ఇస్తుంది. ఇక కేంద్రాన్ని తెలంగాణా ప్రభుత్వం భారీగా నిధులు కూడా కోరుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: