దేశ రక్షణ ఉత్పత్తుల తయారీలో కీలక పురోగతి లభించింది. దేశీయంగా రూపొందించిన నాగ్​ క్షిపణి తుది ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది భారత్​. ఈ క్షిపణి అన్ని పరీక్షలను పూర్తి చేసుకుని సైన్యంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపింది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ)​.


నాగ్​​.. మూడోతరం యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిసైల్​. ప్రత్యర్థుల యుద్ధ నౌకలను.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విజయవంతంగా ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. భారత సైన్యం ప్రస్తుతం రెండోతరం మిలాన్​ 2టీ కొంకుర్​ ఏటీజీఎమ్​ను వినియోగిస్తోంది. ప్రత్యర్థుల అత్యాధునిక యుద్ధ ట్యాంకులను నిలవరించాలంటే మూడోతరం క్షిపణుల కోసం వేచిచూస్తోంది సైన్యం. నాగ్​తో ఆ అవసరం తీరనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: