జమ్ముకశ్మీర్​లోని లేహ్​ ప్రాంతాన్ని చైనా భూభాగంలో ఉన్నట్లు చూపటాన్ని తప్పుపడుతూ.. ట్విట్టర్​ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) జాక్​ డోర్సేకు ఘాటు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. భారత చిత్ర పట్టాన్ని తప్పుగా చూపించటంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దని హెచ్చరించింది.దేశ సార్వభౌమత్వం, సమగ్రతను అగౌరవపరిచే ఏ కార్యక్రమం కూడా ఆమోదయోగ్యం కాదని లేఖలో పేర్కొన్నారు ఐటీ శాఖ కార్యదర్శి అజయ్​ సాహ్నే.


జమ్ముకశ్మీర్​లోని లేహ్​ ప్రాంతాన్ని ట్విట్టర్​ చైనా భూభాగంగా చూపించటంపై వివాదం చెలరేగింది. ట్విట్టర్​పై తీవ్రంగా మండిపడ్డారు నెటిజన్లు. అయితే.. వెంటనే స్పందించిన ట్విట్టర్​.. సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు వివరణ ఇచ్చింది. జమ్ముకశ్మీర్ అంశంలో నెలకొన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకుని గౌరవిస్తామని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: