ఎలక్ట్రానిక్, వైద్య, పర్యాటక విభాగాలు మినహా.. మిగతా అన్నిరకాల వీసాలను పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పర్యాటకం మినహా మిగతా అవసరాల కోసం భారత్‌కు రావాలనుకునే ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు సహా ఇతర విదేశీయులను అనుమతిస్తామని పేర్కొంది.



సముద్ర,వాయు మార్గాల్లో వచ్చేందుకు అనుమతిస్తామన్న హోంశాఖ.. నిర్దేశిత విమానాశ్రయాలు, పోర్టుల ద్వారానే రావాలని సూచించింది.వీసాలను తక్షణమే పునరుద్ధరిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్​కు రావాలనుకునే ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులకు కూడా అనుమతినిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే ఎలక్ట్రానిక్​, వైద్య, పర్యాటక వీసాలకు అనుమతి నిరాకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: