కరోనా కాలంలోనూ వైరస్​ నిబంధనలను పాటిస్తూ విమానాశ్రయాలు సేవలందిస్తున్నాయి. అయితే ఇలాంటి మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడకుండా మరింత చర్యలు తీసుకుంటోంది ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన ఎయిర్​పోర్టుల జాబితాలో రెండోస్థానం సాధించింది.


దాదాపు 200 విమానాశ్రయాల్లోని కరోనా జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించింది విడెస్​ సంస్థకు చెందిన 'సేఫ్​ ట్రావెల్​ బారోమీటర్'​. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో సింగపూర్​లోని చంగీ ఎయిర్​పోర్టు తొలి ర్యాంక్​ సొంతం చేసుకోగా.. జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ విమానాశ్రయం, చైనాలోని చెంగుడు అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీతో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్నాయి. కరోనా సమయంలో ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతా విషయంలో ఇవి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: