ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రధాన సమస్యలపై మోదీ మౌనంగానే ఉన్నారని పేర్కొంది. అయితే ప్రసంగాన్ని వ్యతిరేకించే అంశాలేవీ లేవని చెప్పుకొచ్చింది. గత కొద్ది నెలల్లో మోదీ చేసిన అద్భుతమైన ప్రసంగాల్లో ఇదొకటని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.ప్రధాని ముఖంపై ప్రకాశవంతమైన మెరుపు కనిపించిందని, దేశంలోని సమస్యలను అది తొలగిస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ మేరకు అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది.


దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కావడంపై మోదీ మాట్లాడారు కానీ.. నిరుద్యోగం ఊసెత్తలేదని ఎద్దేవా చేసింది. లద్దాఖ్​లో చైనా అతిక్రమణలపై ఒక్క మాట మాట్లాడలేదని వ్యాఖ్యానించింది.ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలను ఇప్పుడే తెరవకూడదని మోదీ చేసిన వ్యాఖ్యలను సామ్నా గుర్తు చేసింది. మహారాష్ట్రలో ఆలయాలను తెరిచే అంశంపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో వివాదం మధ్య ఈ వ్యాఖ్యలను ప్రస్తావించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: