ఏపీ బిజెపి రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అమరావతి ఉద్యమకారులపై చేసిన విమర్శలు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేసారు. ఈ నేపధ్యంలో ఆయన స్పందించారు.  సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టారు. తప్పుడు ప్రచారాలు చేసి ఉద్యమకారులను అవమానించ వద్దు అని ఆయన విజ్ఞప్తి చేసారు.

అమరావతిలో ఉద్యమం ప్రారంభంమైన 7 రోజున నేను ఉద్యమంలో పాల్గోని రైతులకు మద్దతును ఇచ్చాను అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నా ఫోటో పెట్టి అమరావతి రైతులను సామాజిక మాద్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు  మిత్రుల ద్వార ఇప్పుడే తెలిసింది అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు చర్యలు, ప్రచారాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. రైతు ఉద్యమకారులను విమర్శంచే హక్కు ఎవరుకి లేదు అని అన్నారు. ఆయన 50 వేల చీర కట్టుకుని ఉద్యమం చేస్తున్నారని విమర్శించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: