ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పడం చాలా వరకు కూడా కష్టంగానే ఉంది. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్తుంది ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు.  అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నా  ఏపీలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు మోక్షం లేదు.

ఈ నేపధ్యంలో కీలక అడుగు పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు.  లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం కోరనున్న ఎస్ఈసి... త్వరలోనే ఎన్నికలపై ఒక ప్రకటన చేస్తుంది.  2,129 ఎంపిటిసి, 125 జడ్పిటీసి స్థానాల ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాలను రద్దు చేయాలని  ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఎన్నికల సంఘం ఎలాంటి ముందు అడుగు వేస్తుదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: