బీహార్ లో ఎన్నికల ప్రచారం దూకుడుగా జరుగుతుంది. బీహార్ లో ఎన్నికల ప్రచారాన్ని  కరోనా ఉన్నా సరే సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ... నేను సిఎం అయితే, నా  మొదటి క్యాబినెట్ మీట్‌ లో బీహార్ యువతకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని సంతకం చేస్తా అని ఆయన సవాల్ చేసారు.

 ప్రధాన మంత్రిని బీహార్‌ లో స్వాగతించారు, కాని బీహార్‌ కు ప్రత్యేక హోదా, కర్మాగారాలు లేకపోవడం, నిరుద్యోగం మరియు ఇతర రాష్ట్ర సమస్యల గురించి ఆయన సమాధానాలు  ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  ఇక రాహుల్ గాంధీ కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. బీహార్ కు సముద్రం లేదు కాబట్టి కర్మాగారాలు ఏర్పాటు చేయలేమని సిఎం చెప్పారని... పంజాబ్, రాజస్తాన్, హర్యానాకు కూడా సముద్రం లేదని కాని ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్తారని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: