ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్న శైవక్షేత్ర‌ పీఠాధిపతి శివస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. కొండ చరియలు విరిగిపడిన వెంటనే సిఎం స్పందించడం అభినందనీయం అని అన్నారు. కాని ముందుగానే చర్యలు తీసుకుంటే బావుండేది అన్నారు. హిందూ ధర్మం పై దాడులు జరిగితే ప్రజల్లో తిరుగుబాటు ఎదురవుతుందని హెచ్చరించారు. హిందూ ధర్మం పై దాడుల జరుగుతుంటే  పోలీసులు కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అన్నారు.

ఇక్కడ గాజులు తొడుక్కొని  ఎవ్వరు లేరని అన్నారు. నవంవర్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 30 సంస్ధలు కలిసి పెద్ద‌ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అని పేర్కొన్నారు. హిందూ ధర్మం పై దాడులు జరగకుండా ప్రభుత్వం స్పందించాలన్నారు. మంత్రి కొడాలి నానీపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేసారు.  మేం ఓట్లేస్తేనే ఆ మంత్రి కి మంత్రి పదవి వచ్చింది, దేవుళ్ళపై వ్యాఖ్యల నేపధ్యంలో ఆ మంత్రిని తక్షణమే  బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: