ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ సర్కార్ అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఏపీలో ఎన్నికలు నిర్వహించాలి అని ఏపీ హైకోర్ట్ సూచనలు చేసింది. ఇక ఎన్నికల సంఘం కూడా రెడీ అవుతుంది. ఈ తరుణంలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదు అని అన్నారు.

నవంబర్, డిసెంబర్ నెలలో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి అని ఆయన అన్నారు. దసరా తరువాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెపుతున్నారని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కావున నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికలు రాజ్యాంగ ప్రకారం జరిగి తీరాల్సిందే అని వివరించారు. వాటితో.. స్థానిక సంస్థలు పోల్చకూడదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: