ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చాలా వరకు కూడా విద్యుత్ మీటర్లను టార్గెట్ గా చేసుకుని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. విద్యుత్ మీటర్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆయన హామీ ఇచ్చారు. 30 ఏళ్ల పాటూ రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

సీఎం జగన్ రైతు పక్షపాతి అని స్పష్టం చేసారు. 89 శాతం మంది రైతులకు పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. మీటర్ల విషయంలో చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు అన్నారు. ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదని, ఉచిత విద్యుత్ పథకం తీసుకువచ్చింది వైఎస్ఆర్ ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే చంద్రబాబు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పాడని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: