దేశ వ్యాప్తంగా ఎన్నికల విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. దాదాపుగా వచ్చే ఏడాది చివరి నుంచి దేశంలో ఎన్నికలు మొదలయ్యే అవకాశం ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది అన్నారు.

2022లో ఎన్నికలు జరుగుతాయని మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. న్యాయం, ధర్మం మన వైపే ఉన్నాయి అని పేర్కొన్నారు. అంతిమ విజయం మనదే అవుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు పై విచారణ వేగవంతం చేయడం తో జగన్ లో ఆందోళన పెరిగిందన్నారు. తాను జైలుకు వెళ్ళిన ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: