రాయలసీమ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ సర్కార్ ఎలా వ్యవహరిస్తుంది అనే దానిపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు వస్తాయా లేదా అనేది ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఏపీ సర్కార్ కీలక అడుగు వేసింది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు విడుదల అయ్యాయి.

ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయల సీమ స్టీల్స్ లిమిటెడ్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఎస్ సిఎల్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసింది. గత కొద్ది కాలంగా ఎటువంటి కార్యకలాపాలను ఆర్ఎస్ సిఎల్ నిర్వహించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: