పాకిస్థాన్ దళాలు జమ్ము కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఈ ఏడాది 3,800 సార్లకు పైగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. డ్రోన్లు, క్వాడ్​కాఫ్టర్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలను.. పాక్​ అక్రమ రవాణా చేసిందని తెలిపింది.ఉగ్రవాదుల చొరబాట్లకు మద్దతుగా పౌర ప్రాంతాల్లోనూ పాక్ సైన్యం కాల్పులు చేసిందని విదేశాంగ కార్యదర్శి అనురాగ్ శ్రీవాస్తవ వేర్కొన్నారు.ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతిసారి దౌత్య, సైనిక స్థాయిలో ఈ విషయంపై చర్చలు జరిగినట్లు అనురాగ్​ వెల్లడించారు.


పాకిస్థాన్​ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్​ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్ లిస్ట్​లో చేర్చే అంశంపై స్పందించారు శ్రీవాస్తవ. దీనికి ఆ సంస్థ సరైన ప్రమాణాలు నిర్దేశించిందని అన్నారు. 27 అంశాలున్న ఎఫ్​ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికలో.. పాక్​ 21 అంశాలను మాత్రమే నెరవేర్చిందని, ముఖ్యమైన 6 విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: